02/07/2024
విప్పాల్సిన చోట కప్పింది!
కప్పాల్సిన చోట విప్పింది!!
సాటి ఆడది చూసి సిగ్గుతో
తలదించుకొనే స్థాయికి
వస్త్రాలంకరణ చేసుకుంది.
సిగ్గు చెప్పే తల్లి లేదా!?
బుద్ధి చెప్పే తండ్రి లేడా!?
మంచి,చెడు చెప్పే
తోబుట్టువులు లేరా!?
చూడటానికి ఎబ్బెట్టుగా ఉందని చెప్పే
స్నేహితులు,బంధువులు లేరా!?
స్త్రీకి అన్యాయం జరిగింది అని రోడ్లెక్కి
అరిచే మహిళా సంఘసంస్కర్తలు లేరా!?
ప్రపంమంతా గొడ్డుపొయిందా!? లేక
ప్రపంచమంతా అదే బాటలో నడుస్తుందా!?
ఎక్కడ జరుగుతుంది లోపం!
ఎవరు మోయాలి ఈ పాపం!!
ప్రాణంలేని భరత మాత విగ్రహం సైతం
నిండుగా అలంకరించుకుంటుంది!!
జ్ఞానం లేని వృక్షం సైతం సాంప్రదాయాల పేరుతో
నిండుగా అలంకరించబడుతుంది!!
మానం అమ్ముకొనే స్త్రీ సైతం బయటకొస్తే
నిండుగా అలంకరించుకుంటుంది!!
మరి ప్రాణం,జ్ఞానం,మానం ఉన్న
ఓ స్త్రీ నీకేమైంది!?
పది మంది ఉన్న చోట పరువుగా
ఉండాలనే సంస్కారాన్ని నేర్చుకో!!