24/07/2024
మొదటి ఫోటో జులై 16న ఆంధ్రజ్యోతి వేసిన కార్డూన్. రెండో ఫోటో జులై 24న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులకు సంబంధించి ఆంధ్రజ్యోతి రాసిన కథనం. మోది గారి గుండెల్లో ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు మోది గారి గుండెల్లో ఉండేలా చూడండి సార్... అని సామాాాన్యుడు పవన్ కళ్యాణ్ గారిని అడిగినట్టు కార్టూన్ వేశారు. ఒప్పుకుంటాం. అంగీకరిస్తాం. మీరు వ్యంగ్యంగా వేసినా స్వీకరించే మనస్తత్వం మాకు ఉంది. మరి నేడు అంటే 24 వ తేదీన మీరు వేసిన కార్డూన్ కి బదులిస్తున్నట్టు కేంద్రం రాష్ట్రానికి భారీఎత్తున నిధులు కేటాయించింది. అమరావతికి, పోలవరానికి, విశాఖ ఉక్కుకు సంబంధించి బడ్జెట్లో ప్రస్తావించింది. మరి ఇది పవన్ కళ్యాణ్ గారి విజయం అని రాసే దమ్ము ఆంధ్రజ్యోతికి ఉందా. రాధాకృష్ణ గారు మీరు సమాధానం చెప్పాలి. దీన్ని కూడా చంద్రబాబు ఖాతాలో వేస్తారా? అలా వేసే పక్షంలో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యంగ్యంగా కార్టూన్ ఎందుకు వేసారు. సమాధానం చెప్పాలి మీరు.